---Advertisement---

టీటీడీ బోర్డ్ మెంబెర్ కొడుకు గంజాయి వీడియో కలకలం?

September 2, 2026

Summarize with AI

---Advertisement---

హైదరాబాద్‌ (Hyderabad) రాయదుర్గంలో (Raidurg) చోటుచేసుకున్న హిట్‌ అండ్‌ రన్‌ (Hit-and-Run) ఘటన ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఈ కేసులో ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌, టీటీడీ (TTD)బోర్డు సభ్యుడు ఆనంద్‌ సాయి (Anand Sai) కుమారుడు సందీప్‌ను(Sandeep) పోలీసులు అరెస్టు చేశారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో సందీప్‌ మద్యం సేవించలేదని పోలీసులు వెల్లడించడం, అదే సమయంలో అతడు గంజాయి(Ganja) సేవిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం చర్చనీయాంశంగా మారింది.

ప్రమాద సమయంలో సందీప్‌ మద్యం (Alcohol) సేవించలేదని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న గంజాయి వీడియోపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ వీడియో ఎప్పుడు చిత్రీకరించబడింది? ప్రమాదానికి ముందు లేదా వేరే సమయంలోనా? వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి సందీపేనా? వంటి అంశాలను పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.

కేవలం బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష (Breath Analyzer Test) ఆధారంగా ప్రమాద సమయంలో మత్తు పదార్థాల ప్రభావం లేదని తేల్చలేమని, అవసరమైతే ఇతర శాస్త్రీయ పరీక్షలు కూడా నిర్వహించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రమాదం తెల్లవారుజామున జరిగిన నేపథ్యంలో డ్రైవర్‌ మానసిక, శారీరక స్థితిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని పలువురు కోరుతున్నారు.

ఆనంద్‌ సాయి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు (Pawan Kalyan) అత్యంత సన్నిహితుడిగా రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు టీటీడీ బోర్డు సభ్యత్వం లభించిందనే విమర్శలు గతంలోనూ వినిపించాయి. ఇప్పుడు ఆయన కుమారుడు సందీప్‌కు సంబంధించిన హిట్‌ అండ్‌ రన్‌ కేసు, గంజాయి వీడియో వ్యవహారం తెరపైకి రావడంతో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఆనంద్‌ సాయి కొనసాగడంపైనా చర్చ మొదలైంది.

సనాతన ధర్మం గురించి తరచూ మాట్లాడే పవన్‌ కళ్యాణ్‌కు (Pawan Kalyan) సన్నిహితుడిగా చెప్పబడే ఆనంద్‌ సాయి కుటుంబానికి సంబంధించిన ఈ ఘటన ఇప్పుడు రాజకీయంగానూ చర్చకు దారితీస్తోంది. పవన్ కళ్యాణ్ తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి అనే చర్చ కూడా నడుస్తుంది. అయితే అరవ శ్రీధర్ వ్యవహారం లాగే దినిని కూడా పవన్ వదిలేస్తారని విపక్షాల నుండి వినిపిస్తున్న మాట

హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయి, మరొకరు తీవ్రంగా గాయపడినందున కేసు దర్యాప్తు పూర్తిగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సాగాల్సిన అవసరం ఉంది. నిందితుడి రాజకీయ లేదా సామాజిక పరిచయాలు దర్యాప్తును ప్రభావితం చేయకూడదని బాధితుల కుటుంబాలు, ప్రజలు కోరుతున్నారు.

చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే అన్న నమ్మకాన్ని నిలబెట్టాలంటే.. మద్యం పరీక్షతో పాటు మత్తు పదార్థాల వినియోగంపై వచ్చిన ఆరోపణలు, సీసీ కెమెరా ఆధారాలు, వాహనాల ఫోరెన్సిక్‌ వివరాలు, ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment