---Advertisement---

రంజీ ట్రోఫీకి హైదరాబాద్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్!

September 20, 2026

Summarize with AI

---Advertisement---

రంజీ ట్రోఫీ (Ranji Trophy) 2026-27 సీజన్‌లో తొలి 2 మ్యాచ్‌లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association – HCA) జట్టును ప్రకటించింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా(Captain) వ్యవహరించనున్నాడు. సి.వి. మిలింద్ (C.V. Milind) వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి తదితరులు జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఎలైట్ గ్రూప్-బిలో ఉన్న హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 11 నుంచి 14 వరకు త్రిపురతో (Tripura) తలపడనుంది. అనంతరం విజయనగరం వేదికగా అక్టోబర్ 18 నుంచి ఆంధ్ర జట్టుతో రెండో మ్యాచ్ ఆడనుంది. అయితే తొలి 2 మ్యాచ్‌లకు మాత్రమే మహ్మద్ సిరాజ్ అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటన కోసం భారత జట్టుతో కలిసి వెళ్లనున్నాడు.

మరోవైపు కల్నల్ సి.కె. నాయుడు ట్రోఫీలో భాగంగా రైల్వేస్‌తో అక్టోబర్ 12న, ఉత్తరాఖండ్‌తో అక్టోబర్ 19న తలపడే హైదరాబాద్ అండర్-23 జట్టును కూడా హెచ్‌సీఏ ప్రకటించింది. ఈ జట్టుకు పేరాల అమన్ రావు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, ఆరోన్ జార్జ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

హైదరాబాద్ రంజీ జట్టు

మహ్మద్ సిరాజ్ (కెప్టెన్), సి.వి. మిలింద్ (వైస్-కెప్టెన్.), తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, రాహుల్ సింగ్, హిమ తేజ, రాహుల్ రాధేష్ (వికెట్ కీప‌ర్‌), సాయి ప్రగ్నయ్ రెడ్డి (వికెట్ కీప‌ర్‌), వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి,  రక్షన్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, రుతిక్ యాదవ్ మెండే, సాయి వికాస్ రెడ్డి.

హైదరాబాద్ అండర్-23 జట్టు

అమన్‌రావు (కెప్టెన్‌), ఆరోన్‌ జార్జ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఎ. అవనీష్‌ రావ్ (వికెట్ కీప‌ర్‌), రాఘవ్‌ పట్టాపు, వాఫీ కచ్చి, ఎ. విఘ్నేష్‌ రెడ్డి, సుంకరి ధీరజ్‌ (వికెట్ కీప‌ర్‌), ఆర్‌. సాయి శరణ్‌, ప్రణవ్‌ వర్మ, మురుగన్‌ అభిషేక్‌, కుష్‌ అగర్వాల్‌, నిశాంత్‌ మహోద్‌లీ, డినేష్‌. రాహుల్‌. కార్తికేయ.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment