---Advertisement---

మళ్లీ ప్రత్యక్షమైన IBOMMA… కొత్త సినిమాలతో నెట్‌లో రీఎంట్రీ!

May 13, 2026

---Advertisement---

కొద్ది నెలల క్రితం వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఐబొమ్మ (IBOMMA) పేరు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పైరసీ సినిమాలను విడుదల చేస్తోందనే ఆరోపణలతో సైబర్ క్రైమ్ పోలీసులు IBOMMA నిర్వహకుడు రవిని(Ravi) అరెస్టు చేశారు. ఆ తర్వాత అతనితోనే వెబ్‌సైట్‌ను తొలగింపజేయడంతో ఇంటర్నెట్‌లో ఐబొమ్మ పూర్తిగా కనిపించకుండా పోయింది.

అయితే తాజాగా ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన కొద్ది రోజులకే ఇంటర్నెట్‌లో మళ్లీ ఐబొమ్మ (IBOMMA) వెబ్‌సైట్ ప్రత్యక్షమవడం సంచలనం రేపుతోంది. ముఖ్యంగా “Bappam” పేరుతో ఉన్న ఒక లింక్‌పై క్లిక్ చేస్తే నేరుగా ఐబొమ్మ ఓపెన్ అవుతుండటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇందులో 2026 సంవత్సరానికి చెందిన కొత్త సినిమాలు కూడా కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో సినిమా నిర్మాతలు (Producers), డిస్ట్రిబ్యూటర్లు (Distributors) మళ్లీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. గతంలో చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు విడుదలైన 24 గంటల్లోపే HD ప్రింట్లతో ఈ సైట్‌లో లీక్ కావడం ఇండస్ట్రీకి భారీ నష్టాలను మిగిల్చింది.

ఇప్పుడు మళ్లీ అదే తరహాలో కొత్త సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయనే వార్తలు రావడంతో టాలీవుడ్‌తో పాటు ఇతర సినీ పరిశ్రమల్లో (Film Industries) కూడా కలకలం రేగుతోంది. సైబర్ క్రైమ్ అధికారులు ఈ అంశంపై మరోసారి దృష్టి సారించే అవకాశం ఉందని సమాచారం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment