---Advertisement---

భారత్–వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్ ఖరారు.. ఎప్పుడెప్పుడు మ్యాచ్‌లంటే?

September 15, 2026

Summarize with AI

---Advertisement---

భారత్ – వెస్టిండీస్ (India-West Indies) జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. స్వదేశంలో టీమిండియా West Indies ఆడనున్న ఈ సిరీస్‌లో 3 వన్డేలు(ODIs), 5 టీ20 మ్యాచ్‌లు (T20 Matches) జరగనున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ సిరీస్ కొనసాగనుంది.

ముందుగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఆ తర్వాత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ నిర్వహించనున్నారు. ఇరు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.

వన్డే సిరీస్ షెడ్యూల్

  1. తొలి వన్డే – సెప్టెంబర్ 27, మధ్యాహ్నం 1 గంటలకు
  2. రెండో వన్డే – సెప్టెంబర్ 30, మధ్యాహ్నం 1 గంటలకు
  3. మూడో వన్డే – అక్టోబర్ 3, మధ్యాహ్నం 1 గంటలకు

టీ20 సిరీస్ షెడ్యూల్

  1. తొలి టీ20 – అక్టోబర్ 6, సాయంత్రం 6 గంటలకు
  2. రెండో టీ20 – అక్టోబర్ 9, సాయంత్రం 6 గంటలకు
  3. మూడో టీ20 – అక్టోబర్ 11, సాయంత్రం 6 గంటలకు
  4. నాలుగో టీ20 – అక్టోబర్ 14, సాయంత్రం 6 గంటలకు
  5. ఐదో టీ20 – అక్టోబర్ 17, సాయంత్రం 6 గంటలకు

భారత్ – వెస్టిండీస్ మధ్య జరిగే ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లను అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రసార ఏర్పాట్లు చేశారు. జియో హాట్‌స్టార్‌లో(JioHotstar) మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉండనుండగా, స్టార్ స్పోర్ట్స్ టీవీ (Star Sports) ఛానళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

సొంతగడ్డపై జరగనున్న ఈ సిరీస్‌లో టీమిండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మరోవైపు వెస్టిండీస్ కూడా భారత జట్టుకు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. దీంతో వన్డేలు, టీ20ల్లో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment