---Advertisement---

ఐపీఎల్ 2027 వేలంపై బీసీసీఐ కీలక ప్రకటన.. వేదిక, తేదీలు ఖరారు!

September 23, 2026

Summarize with AI

---Advertisement---

ఐపీఎల్(IPL) 2027 సీజన్‌కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ప్రతిష్ఠాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) తదుపరి సీజన్ కోసం నిర్వహించనున్న మినీ వేలం తేదీ, వేదిక ఖరారయ్యాయి. ఈసారి ఐపీఎల్ వేలం భారత్‌లోనే(India) జరగనుంది.

ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్(Arun Dhumal), బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా (Devajit Saikia) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 15, 16 తేదీల్లో గోవాలో(Goa) నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ(BCCI) అధికారికంగా వివరాలను వెల్లడించింది.

గత 3 సీజన్లలో ఐపీఎల్ వేలాలు (IPL Auctions) భారత్ వెలుపల జరిగాయి. దుబాయ్, జెడ్డా, అబుదాబి నగరాలు గత వేలాలకు ఆతిథ్యం ఇచ్చాయి. అయితే ఈసారి వేలాన్ని తిరిగి భారత్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగానే గోవాను వేదికగా ఎంపిక చేసింది.

ఐపీఎల్ 2027 వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత బలోపేతం చేసుకునేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వేలంలో అందుబాటులోకి వచ్చే ఆటగాళ్లను దక్కించుకునేందుకు జట్లు ప్రణాళికలు రూపొందించనున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment