---Advertisement---

నిరుద్యోగుల భవిష్యత్తుకు ఎవరు బాధ్యత? డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు జగన్‌ ప్రశ్నల వర్షం.

September 14, 2026

Summarize with AI

---Advertisement---

డీఎస్సీ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్నాయని ఆరోపణలు వస్తున్న అక్రమాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. నియామక పరీక్షలపై విశ్వసనీయత కోల్పోతే.. ఫలితాలు మాత్రమే ప్రభావితం కావని, లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు, నమ్మకం కూడా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన జగన్‌.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి శ్రమిస్తూ, తమ కుటుంబాల కష్టార్జితాన్ని ఖర్చు చేస్తూ సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. తమ ప్రతిభను నిరూపించుకునేందుకు వారికి కావాల్సింది నిష్పక్షపాతమైన, పారదర్శకమైన అవకాశం మాత్రమేనన్నారు. నియామక వ్యవస్థలో లోపాలు చోటుచేసుకుంటే అది కేవలం ఫలితాలను ప్రభావితం చేయడమే కాకుండా.. మొత్తం నియామక ప్రక్రియపై నిరుద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.

చంద్రబాబును నేరుగా ప్రశ్నించిన జగన్‌.. అభ్యర్థులకు న్యాయం చేయడం ప్రభుత్వానికి ఆప్షన్ కాదని, అది బాధ్యత అని స్పష్టం చేశారు. అభ్యర్థుల కష్టానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? వారి భవిష్యత్తుకు జవాబుదారీతనం వహించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.

డీఎస్సీ నియామక ప్రక్రియలో వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్న ఆరోపణలకు చంద్రబాబు బాధ్యత వహిస్తారా? అని జగన్‌ నిలదీశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడవద్దని, వారి కష్టానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment