---Advertisement---

జన నాయగన్’ సెన్సార్ పూర్తి.. విడుదల ఎప్పుడంటే?

July 2, 2026

Summarize with AI

---Advertisement---

తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘జననాయగన్’(Jananayagan) ఒకటి. తమిళనాడు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో అడుగుపెట్టే ముందు స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్ వినోద్ (H. Vinoth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) నిర్మించింది. విజయ్ సరసన పూజా హెగ్డే(Pooja Hegde) కథానాయికగా నటించగా, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమా తొలుత ఈ ఏడాది జనవరి 9న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. చిత్ర నిర్మాతలు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ Central Board of Film Certification – CBFC) మధ్య నెలకొన్న కొన్ని అంశాల కారణంగా విడుదల తేదీ పలుమార్లు మారింది. దీంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. విడుదలపై స్పష్టత లేకపోవడంతో సోషల్ మీడియాలో కూడా అనేక రకాల ప్రచారాలు సాగాయి.

ఇదిలా ఉండగా, సినిమా విడుదలకు ముందే కొన్ని కీలక సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్రబృందానికి పెద్ద షాక్ ఇచ్చింది. వెంటనే అప్రమత్తమైన నిర్మాతలు సైబర్ క్రైమ్ అధికారులను ఆశ్రయించి, పైరసీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు ప్రారంభించారు. దీంతో సినిమా భద్రత విషయంలో మేకర్స్ మరింత జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ‘జననాయగన్’ గురించి మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, సినిమా విడుదలకు సిద్ధమైందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జులై 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు, సినిమా ఇటీవలే సెన్సార్ (Censor) కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సినిమాలో రాజకీయ నేపథ్యంలోని శక్తివంతమైన డైలాగులు, యాక్షన్ సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘ఎ’(A) సర్టిఫికెట్ జారీ చేసినట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికీ, విడుదలకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ఎన్నో నెలలుగా విజయ్ చివరి సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఈ అప్డేట్‌ను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన (Official Announcement) వస్తే అభిమానుల ఆనందానికి మరింత ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment