---Advertisement---

జనసేన క్యాడర్‌కు మరోసారి షాక్ ఇచ్చిన నాదెండ్ల వ్యాఖ్యలు!

September 19, 2026

Summarize with AI

---Advertisement---

స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నేపథ్యంలో జనసేనలో(Jana Sena Party) సీట్ల కేటాయింపుపై (Seat Allocation) చర్చ జరుగుతున్న వేళ.. ఆ పార్టీ క్యాడర్‌కు నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. పార్టీకి ఎక్కువ స్థానాలు కావాలని ఆశిస్తున్న కార్యకర్తలకు.. “సంస్థాగతంగా మనం ఇంకా బలంగా లేకపోవచ్చు.. నిదానంగా ఎదగాలి” అంటూ ఆయన సూచించడం ఆసక్తికరంగా మారింది. పార్టీ స్థాపించి 12 ఏళ్లు, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన తర్వాత కూడా సంస్థాగత బలం లేదని చెప్పడంపై జనసేనలోనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు.. కార్యకర్తలు పదవుల (Positions) కోసం కాకుండా దేశం (Nation) కోసం పనిచేయాలని నాదెండ్ల మనోహర్ హితబోధ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. నాయకులు పదవులు చేపడుతుంటే.. కార్యకర్తలు మాత్రం పదవులు ఆశించకుండా పనిచేయాలన్న సందేశం ఇవ్వడం వెనుక ఉన్న లాజిక్ ఏమిటంటూ జనసేన శ్రేణుల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి.

గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకంపై టీడీపీ(TDp) 80 శాతం, జనసేన(Jana Sena) 15 శాతం, బీజేపీ(BJP) 5 శాతం నిష్పత్తిలో పోటీ చేసే అవకాశాలపై నారా లోకేష్(Nara Lokesh) చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి. దీనిపై జనసేన క్యాడర్ నుంచి అసంతృప్తి వ్యక్తం కావడంతో.. స్థానిక పరిస్థితులను బట్టి సీట్ల పంపకం ఉంటుందని నాదెండ్ల మనోహర్ అప్పట్లో స్పష్టం చేశారు.

అయితే తాజాగా మరోసారి “సంఖ్య పెంచుకోవడం కోసం సీట్లు అడగొద్దు.. గెలిచే అవకాశమున్న స్థానాలనే తీసుకోవాలి.. 100 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా పనిచేయాలి” అంటూ నాదెండ్ల చేసిన వ్యాఖ్యలు జనసేన క్యాడర్‌లో (Jana Sena Cadre) కొత్త చర్చకు తెరతీశాయి. పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతంపై 12 ఏళ్ల తర్వాత కూడా ఇదే తరహా మాటలు వినిపించడం రాజకీయంగా సెటైర్లకు కారణమవుతోంది.

“పార్టీ నిర్మాణం ఒక రోజులోనో, ఏడాదిలోనో, ఐదేళ్లలోనో పూర్తికాదు.. నిదానంగా ఎదగాలి” అనే సందేశంతో కార్యకర్తల ఆశలకు బ్రేకులు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, జనసేనకు కీలక స్థానాలు దక్కకుండా కూటమి సీట్ల సర్దుబాటు జరుగుతోందన్న చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

మొత్తంగా.. సీట్ల సంఖ్య కంటే గెలిచే సీట్లే ముఖ్యమంటూ జనసేన నాయకత్వం చెబుతున్న వేళ, “అయితే పార్టీని ఇంతకాలం సంస్థాగతంగా ఎందుకు బలోపేతం చేయలేకపోయారు?” అనే ప్రశ్నకు సమాధానం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో మాత్రం లోకేష్(Nara Lokesh) వ్యూహాలకు జనసేన కేడర్ చిత్తు అవుతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment