తనకు టీడీపీ (TDP) నేతల నుంచి ప్రాణహాని ఉందని తాడిపత్రి(Tadipatri) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Peddareddy) ఆరోపించారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి(JC Asmith Reddy), జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), మంత్రి నారా లోకేష్‌కు(Nara Lokesh) తెలిసే జరుగుతోందా? అని ప్రశ్నించారు.
జేసీ కుటుంబం చేస్తున్న అరాచకాలపై అనంతపురం ఎస్పీ జగదీష్ (SP Jagdish) ఎందుకు స్పందించడం లేదని పెద్దారెడ్డి ప్రశ్నించారు. తన ఇంటి వద్ద అలజడి సృష్టించిన జేసీ వర్గీయులపై కేవలం న్యూసెన్స్ కేసు నమోదు చేయడం దారుణమన్నారు.
తన గన్‌మెన్‌ను (Gunman) ట్రాప్ చేసి తనకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు జేసీ వర్గీయులు సేకరిస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. తన కదలికలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని అన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి పోలీసులు కోవర్టులుగా మారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
పోలీసులు జేసీ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై థర్డ్ పార్టీ విచారణ (Third Party Investigation) జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు.






