---Advertisement---

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం.. సీబీఎస్ఈ ఫలితాల వివాదంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

May 30, 2026

Summarize with AI

---Advertisement---

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)(CBSE) ఇటీవల ప్రకటించిన 12వ తరగతి ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన ఆయన, గతంలో తెలంగాణలో (Telangana) ఇంటర్మీడియట్ ఫలితాల (Intermediate Results) గందరగోళానికి కారణమైన సంస్థే ఇప్పుడు పేరు మార్చుకుని సీబీఎస్ఈ కాంట్రాక్టును దక్కించుకుందని ఆరోపించారు.

సీబీఎస్ఈ మార్కుల కేటాయింపులో (Marks Allocation Process) చోటుచేసుకున్న తప్పిదాలపై ప్రశ్నిస్తూ, తమకు జరిగిన అన్యాయంపై ధైర్యంగా పోరాడుతున్న 12వ తరగతి విద్యార్థులను కేటీఆర్ అభినందించారు. అధికారంలో ఉన్నవారిని నిలదీస్తూ జవాబుదారీతనం కోరుతున్న విద్యార్థుల ధైర్యసాహసాలు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

2019లో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల నిర్వహణలో (Intermediate Results Management) తీవ్ర లోపాలకు కారణమై లక్షలాది మంది విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిన గ్లోబరీనా సంస్థే (Globarena Technologies) ప్రస్తుతం పేరు మార్చుకుని సీబీఎస్ఈ నుంచి మరింత పెద్ద కాంట్రాక్టును పొందడం దురదృష్టకరమని కేటీఆర్ విమర్శించారు. ఒక అసమర్థ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు సీబీఎస్ఈ బోర్డు పదేపదే నిబంధనలను సవరించిందని, ఆ సంస్థ గత చరిత్రను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.

2019లో గ్లోబరీనా వివాదం వెలుగులోకి వచ్చిన వెంటనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) స్పందించిందని కేటీఆర్ గుర్తు చేశారు. 3 సభ్యుల కమిటీ నియమించి విచారణ జరిపిన అనంతరం నివేదిక ఆధారంగా బాధ్యులైన అధికారులను విధుల నుంచి తొలగించడంతో పాటు సంబంధిత సంస్థపై న్యాయపరమైన చర్యలు కూడా చేపట్టామని తెలిపారు.

లక్షలాది మంది విద్యార్థుల (Students) భవిష్యత్తుతో ముడిపడిన ఈ భారీ తప్పిదానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి సమాధానం చెప్పాలని కోరారు. విఫలమైన, అవినీతికి నిలయంగా మారిన వ్యవస్థలపై (Corruption-Ridden Systems) దేశ భవిష్యత్తును నిర్మించడం సాధ్యం కాదని ఆయన తన ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment