---Advertisement---

రైతు బీమా నిలిపివేతపై కేటీఆర్ ఆగ్రహం.. పశువుల బీమాపై కీలక వ్యాఖ్యలు!

September 26, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) తీసుకుంటున్న నిర్ణయాలపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి విమర్శలు చేశారు. రైతు కుటుంబాలకు (Farmer Families) ఆర్థిక భరోసా కల్పించే రైతు బీమా పథకం ప్రీమియం (Rythu Bima Scheme Premium) చెల్లింపులను ప్రభుత్వం నిలిపివేసిందన్న వార్తల నేపథ్యంలో.. మరోవైపు పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు పశువుల బీమా పథకాన్ని (Cattle Insurance Scheme) ప్రారంభించడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

రైతు బీమాను నిలిపివేయడంపై కేటీఆర్ అభ్యంతరం

కరీంనగర్ వేదికగా పశువుల కోసం ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని కేటీఆర్ ‘ఎక్స్’ ద్వారా ప్రస్తావించారు. రైతు బీమా పథకాన్ని (Rythu Bima Scheme) పక్కనపెట్టి పశువుల బీమాకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రైతు మరణించిన సందర్భంలో అతడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే రైతు బీమా పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పథకం ప్రీమియం చెల్లింపులను నిలిపివేయడం సరికాదని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) అనుసరిస్తున్న విధానాలపై కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బర్కత్ పల్లి గ్రామానికి చెందిన రైతు ఒర్సు రాంచందర్ (Orsu Ramchander) గుండెపోటుతో మృతి చెందిన ఘటనను కేటీఆర్ ప్రస్తావించారు. రాంచందర్ కుటుంబ సభ్యులు రైతు బీమా (Rythu Bima) కింద ఆర్థిక సాయం కోసం ప్రయత్నించగా, ఆగస్టు 14 నుంచి పథకం నిలిచిపోయిందని ఏఈఓ తెలిపినట్లు వచ్చిన వార్తా కథనానికి సంబంధించిన క్లిప్పింగ్‌ను ఆయన ‘ఎక్స్’లో షేర్ చేశారు.

రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే రైతు బీమా పథకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవైపు రైతు బీమా నిలిచిపోయిందన్న వార్తలు వస్తుండగా, మరోవైపు పశువుల బీమా పథకాన్ని ప్రారంభించడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment