---Advertisement---

రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. “ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఎందుకింత ఆగ్రహం?”

October 1, 2026

Summarize with AI

---Advertisement---

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై (Congress Government Governance) బీఆర్ఎస్(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో(Telangana Bhavan) నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన, ప్రభుత్వ విధానాలు, గతంలో చేసిన ఆరోపణలపై ప్రశ్నలు సంధించారు.

రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా రైతుల (Farmers) కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ప్రజలను మోసం (People Cheat) చేయవద్దని కేసీఆర్(KCR) గతంలో చేసిన హెచ్చరికలు ఇప్పుడు నిజమవుతున్నాయని వ్యాఖ్యానించారు. పాత పాలనను తిరిగి తీసుకొస్తానన్న రేవంత్ రెడ్డి.. రాష్ట్రాన్ని మళ్లీ సమస్యల్లోకి నెట్టారని విమర్శించారు.

సిరిసిల్ల (Sircilla) సీఎం పర్యటనపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 35 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు (Handloom Workers Suicides) చేసుకున్నారని, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందిస్తారని ఆశించినా అది జరగలేదని పేర్కొన్నారు.

సీఎం పర్యటనకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించిన కేటీఆర్.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు యూరియా కొరతతో (Urea Shortage) ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని భవనాలు, ఫార్ములా-ఈ రేసింగ్(Formula E Racing), ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వంటి అంశాలపై గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేటీఆర్ ప్రస్తావించారు. ప్రభుత్వం వద్ద అధికారాలు ఉన్నప్పటికీ ఆ ఆరోపణల్లో ఇప్పటివరకు ఏం తేల్చారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై తాము ప్రశ్నిస్తున్నందుకే సీఎంకు తమపై ఆగ్రహం వస్తోందని వ్యాఖ్యానించారు.

తనపై సీఎం చేసిన వ్యక్తిగత విమర్శలకు కేటీఆర్ స్పందిస్తూ.. వ్యక్తిగత విమర్శలు చేయడం కంటే పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. తాను ఉన్నత విద్య అభ్యసించానని, తన విద్యార్హతలు, వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, అనంతరం మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా, కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. రాజకీయ విమర్శలకు బదులుగా రైతులు, చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment