---Advertisement---

‘రావు బహదూర్’ రిలీజ్ కోసం వెయిటింగ్.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్

June 25, 2026

Summarize with AI

---Advertisement---

సత్యదేవ్ (Satyadev) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’ (Rao Bahadur) విడుదలకు సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) తమ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై (Srichakra’s Entertainments), ఏ ప్లస్ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా (Venkatesh Maha) దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. విడుదల చేసిన గ్లింప్స్, టీజర్ (Teaser), పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ చిత్రం జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘రావు బహదూర్’ చిత్రంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.

‘రావు బహదూర్ కేవలం మిమ్మల్ని కట్టిపడేసే సినిమా మాత్రమే కాదు. ఇది మీ మనసులో చాలా కాలం నిలిచిపోయే అనుభూతిని కలిగించే చిత్రం. విభిన్నమైన కథతో, అందమైన విజువల్స్‌తో, తీవ్ర భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha) అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించగా, సత్యదేవ్ తన నటనతో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. దీపా థామస్ అద్భుతమైన నటనతో మెప్పించారు. ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక బృందం అందరూ అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ మొత్తం బృందం పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది. జులై 3 నుంచి థియేటర్లలో ‘రావు బహదూర్’ను, అతని మ్యాడ్‌నెస్‌ను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ మహేష్ బాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

మహేష్ బాబు చేసిన ఈ ప్రశంసలతో ‘రావు బహదూర్’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే విభిన్న కథాంశంతో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం విడుదల తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment