---Advertisement---

మహేష్ బాబు వాయిస్‌తో మరింత ఆసక్తి పెంచిన ‘రావు బహదూర్’ ట్రైలర్!

July 1, 2026

Summarize with AI

---Advertisement---

సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘రావు బహదూర్’ (Rao Bahadur) ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. విభిన్న కథలను ఎంచుకోవడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు వెంకటేష్ (Venkatesh Maha) మహా ఈ చిత్రాన్ని రూపొందించగా, మహేష్ బాబు (Mahesh Babu) సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ (GMB Entertainment) బ్యానర్‌పై ఈ మూవీ నిర్మితమైంది. దీపా థామస్(Deepa Thomas), మాల పరాశర్(Mala Parvathi), వికాస్ ముప్పాళ్ల (Vikas Muppala) కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా ప్రమోషన్స్‌లో (Promotions) భాగంగా తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ ట్రైలర్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు తన గంభీరమైన వాయిస్ ఓవర్ అందించడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “నాటకానికి లాజిక్ ఉండదు అంటారు.. కానీ నాటకానికి మాయ తోడైతే లాజిక్కే మారిపోతుంది” అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ (Trailer) మొదటి క్షణం నుంచే ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రంలో చివరి దశ లివర్ క్యాన్సర్‌తో మరణానికి చేరువైన వ్యక్తి అద్భుతమైన పరిణామాల తర్వాత మళ్లీ జీవితాన్ని పొందిన రామయ్య (Ramaiah) అలియాస్ రావు బహదూర్ (Rao Bahadur) పాత్రలో సత్యదేవ్ తన నటనతో మరోసారి ఆకట్టుకునేలా కనిపించారు. పాత్రలోని భావోద్వేగాలు, మిస్టరీ, అంతర్మథనాన్ని ట్రైలర్‌లోనే బలంగా చూపించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూడని కొత్త తరహా సినిమాటిక్ అనుభూతిని ఈ చిత్రం అందించబోతున్నట్లు ట్రైలర్ స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. డార్క్ కామెడీ, సస్పెన్స్, మ్యాజికల్ రియలిజం అంశాలను సమర్థంగా మేళవించిన ఈ సినిమా ప్రేక్షకులకు వినూత్నమైన అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

ట్రైలర్‌లో కనిపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కథలోని మిస్టరీ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను పెంచాయి. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ట్రైలర్‌కు అదనపు బలం చేకూర్చగా, సత్యదేవ్ నటన మరోసారి ప్రత్యేక చర్చకు దారి తీసింది. మొత్తంగా ‘రావు బహదూర్’ (Rao Bahadur) ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ జూలై 3న విడుదల కానున్న సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment