---Advertisement---

Makutam Teaser: విశాల్ ‘మకుటం’ టీజర్ రిలీజ్..త్రిపాత్రాభినయంతో విశ్వ‌రూపం..

June 12, 2026

Summarize with AI

---Advertisement---

విశాల్ (Vishal) హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘మకుటం'(Makutam) ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. హీరోగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాల్, ఈ చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మారడం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ (Super Good Films) బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు రవి అరసు (Ravi Arasu) కథ అందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకోగా తాజాగా విడుదలైన యాక్షన్ టీజర్ (Action Teaser) మరింత హైప్ క్రియేట్ చేసింది.

టీజర్ ప్రారంభంలో మండుతున్న శవం మధ్యలో నుంచి సిగరెట్ వెలిగించుకుంటూ విశాల్ కనిపించిన ఎంట్రీ సీన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో టీజర్ మొత్తం హై వోల్టేజ్ మూడ్‌లో సాగింది. ఈ చిత్రంలో విశాల్ 3 విభిన్న పాత్రల్లో కనిపించనుండటం ప్రధాన ఆకర్షణగా మారింది. మూడు వేర్వేరు గెటప్స్‌లో ఆయన కనిపించిన తీరు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇక హీరోయిన్ అంజలి(Anjali) కూడా ఈ చిత్రంలో పూర్తి మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఆమె పాత్రలో యాక్షన్ ఎలిమెంట్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు టీజర్ ద్వారా స్పష్టమైంది. విజువల్స్, స్టంట్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా జీవీ ప్రకాశ్ కుమార్ (G. V. Prakash Kumar) అందిస్తున్న సంగీతం టీజర్‌కు అదనపు బలంగా నిలిచింది.

ఈ చిత్రంలో దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన మకుటం మూవీ జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment