---Advertisement---

మంచు మనోజ్ కామెంట్స్‌తో మళ్లీ రచ్చ.. మంచు ఫ్యామిలీ గొడవలు ఇంకా ముగియలేదా?

May 19, 2026

---Advertisement---

మంచు ఫ్యామిలీలో (Manchu Family) గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అన్నదమ్ములు మంచు విష్ణు(Manchu Vishnu), మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య ఆస్తి తగాదాలు, వ్యక్తిగత విభేదాలు ఉన్నాయన్న వార్తలు చాలా రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఈ విభేదాల కారణంగానే మంచు మనోజ్ తన భార్యా పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. గతంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకోవడం, బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వంటి ఘటనలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి.

అయితే గత కొన్ని రోజులుగా ఇద్దరూ తమ తమ సినిమాలు, వ్యక్తిగత పనులతో బిజీగా ఉండటంతో ఈ వివాదం (Controversy) ముగిసిపోయిందని చాలామంది భావించారు. కానీ తాజాగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పరిస్థితి ఇంకా పూర్తిగా చల్లారలేదనే సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న మనోజ్‌కు ఫ్యామిలీ వివాదాలపై ఓ జర్నలిస్ట్ ప్రశ్న (Journalist Question) వేశారు.

“మీ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయ్యాయా?” అని అడగగా.. మనోజ్ నవ్వుతూ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది. “ఆ ప్రశ్న ఎవరిని అడగాలో మీకే బాగా తెలుసు. అక్కడికే వెళ్లి అడగండి. కానీ వెళ్లేటప్పుడు మైక్(Mic) పట్టుకుని మాత్రం వెళ్లొద్దు.. తలకు మంచి హెల్మెట్ (Helmet) పెట్టుకుని వెళ్లండి” అంటూ సరదాగా కామెంట్ చేశారు.

మనోజ్ ఈ వ్యాఖ్యలు నవ్వుతూ చేసినప్పటికీ, అవి పరోక్షంగా మంచు విష్ణును ఉద్దేశించిందేనని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుండగా.. మంచు అన్నదమ్ముల మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పట్లో ఈ వివాదానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment