పందెం అంటే కేవలం పోటీ కాదు.. తెలివి, వ్యూహాలతో కూడిన ఆట అనే ఆసక్తికరమైన అంశంతో తెరకెక్కిన చిత్రం ‘మండాడి’(Mandadi). సుహాస్(Suhas), సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మదిమారన్ పుగళేంది (Madimaran Pugazhendi) దర్శకత్వం వహించారు.
ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ (Elred Kumar) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ‘మండాడి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనగా.. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్(Trailer) మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.
ట్రైలర్‌లో కథాంశంతో పాటు ప్రధాన పాత్రల స్వభావాలు, వారి మధ్య సాగే సంఘర్షణను ఆసక్తికరంగా చూపించారు. ముఖ్యంగా పందెం చుట్టూ సాగే కథలో తెలివి, వ్యూహాలు కీలకంగా ఉండబోతున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. కథలోని ఉత్కంఠను ప్రేక్షకుల్లో పెంచేలా ట్రైలర్‌ను రూపొందించారు.
సుహాస్, సూరి తమ నటనతో ఆకట్టుకోగా.. ఇద్దరి పాత్రల చుట్టూ సాగే కథనం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఆసక్తికరమైన కథ, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ‘మండాడి’పై అంచనాలు మరింత పెరిగాయి.
‘మండాడి’ చిత్రం సెప్టెంబరు 10న (September 10) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పీ విడుదల చేస్తోంది. మరి థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.







