---Advertisement---

Nagarjuna: “మనోడు ‘లెనిన్’ 10th జులై వస్తున్నాడు”… అఖిల్‌పై నాగ్ ఫుల్ కాన్ఫిడెన్స్!

June 13, 2026

---Advertisement---

అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా తెరకెక్కుతున్న ‘లెనిన్'(Lenin) సినిమాపై రోజురోజుకు అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్ సోషల్ మీడియాలో మంచి హైప్ తీసుకురాగా.. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌పై (Movie Release Date) మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. మొదట ఈ సినిమాను జూన్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేసిన చిత్రబృందం.. ఇప్పుడు సినిమాను జులై 10కి (July 10) వాయిదా వేసింది. అయితే సాధారణంగా సినిమా పోస్ట్‌పోన్ అంటే అభిమానుల్లో నిరాశ కనిపిస్తుంది. కానీ లెనిన్ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది.

సినిమా ఆలస్యానికి కారణం ఏంటో స్వయంగా నాగార్జున వెల్లడించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. “లెనిన్ టీమ్ (Lenin Team) నా దగ్గరకు వచ్చి ఒక చిన్న రిక్వెస్ట్ చేసింది. ఔట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని కోరుకున్నారు. అందుకోసం ఇంకొంచెం సమయం కావాలని చెప్పారు. వాళ్లలో కనిపించిన ప్యాషన్, కమిట్‌మెంట్ చూసాక నేను కూడా వెంటనే ఒప్పుకున్నాను” అంటూ నాగార్జున చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు అఖిల్ అభిమానులకు నాగ్ ఇచ్చిన హామీ మరింత ఆసక్తి పెంచుతోంది. “మనోడు జులై 10న వస్తున్నాడు. ఈసారి మీరు పూర్తిగా కొత్త అఖిల్‌ను చూస్తారు” అంటూ నాగార్జున(Nagarjuna) భారీ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. దీంతో లెనిన్ సినిమా అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుందనే చర్చ మొదలైంది.

ఇప్పటివరకు క్లాస్ ఇమేజ్‌తో కనిపించిన అఖిల్.. ఈసారి ఫుల్ మాస్ అవతార్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని సమాచారం. కొత్త బాడీ లాంగ్వేజ్, పవర్‌ఫుల్ యాక్షన్, డిఫరెంట్ యాటిట్యూడ్‌తో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్‌లో లెనిన్ సినిమాపై భారీ బజ్ నెలకొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment