పులివెందుల డీఎస్పీ(Pulivendula DSP) మురళీ నాయక్‌పై(Murali Naik) జాతీయ ఎస్టీ కమిషన్ National ST Commission) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో(Hyderabad) నిర్వహించిన విచారణకు(Hearing) కడప ఎస్పీ ఎందుకు హాజరు కాలేదని కమిషన్ ప్రశ్నించింది. ఒకే కేసులో ఒక వర్గానికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసి, ఎస్టీలపై (STs) మాత్రం ఏకపక్షంగా అరెస్టులు, రిమాండ్లు ఎందుకు చేశారని పోలీసులను నిలదీసింది. స్థానికంగా ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అంటూ డీఎస్పీ మురళీ నాయక్‌ను కమిషన్ సభ్యుడు జుటోత్ హుస్సేన్ నాయక్ (Jutoth Hussain Naik) ప్రశ్నించారు. “మాకు సోది చెప్పకండి” అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై జాతీయ ఎస్టీ కమిషన్ తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై పోలీస్ శాఖలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బాధితులు స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్ విచారణకు ఎస్పీ ఎందుకు రాలేదు?.. డీఎస్పీ మురళీ నాయక్‌పై ఎస్టీ కమిషన్ ఆగ్రహం
by Vartha Byte
September 11, 2026

---Advertisement---




