టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలెంటెడ్ హీరో నితిన్(Nithiin), ఆఫియా జంటగా నటిస్తున్న కొత్త సినిమా త్వరలోనే గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ (Murali Kanth Devasoth) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్‌ను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను రాబోయే సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. లాంచ్ కార్యక్రమంతో పాటు రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నిర్మాతగా (Producer) వ్యవహరించడం. తన సొంత నిర్మాణ సంస్థ ‘యూనానిమస్ ప్రొడక్షన్స్’(Unanimous Productions) బ్యానర్‌పై నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విభిన్న కథలకు ప్రాధాన్యం ఇచ్చే నాని నిర్మాణంలో నితిన్ నటిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై భారీ హైప్ ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం, విడుదల తేదీ వంటి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.






