యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) – దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం “NTRNeel” వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జూన్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారిక ప్రకటన చేసింది.
ఇక మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం.. తాజాగా విడుదల సమయాన్ని కూడా అధికారికంగా వెల్లడించింది.
మే 19 రాత్రి 11:52 గంటలకు “NTRNeel” గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ గ్లింప్స్ వీడియో నిడివి ఏకంగా 4 నిమిషాల 35 సెకన్లు ఉండనుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.
ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్(Rukmini Vasanth) నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






