---Advertisement---

OM: ఓం ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ధనుష్ మాస్ ఎనర్జీతో ‘అలాకా లూవా’ వైరల్!

July 29, 2026

Summarize with AI

---Advertisement---

ధనుష్ (Dhanush) హీరోగా తెరకెక్కుతున్న 55వ చిత్రం ‘ఓం – చాప్టర్ 1(OM-Chapter 1): ఉధిరమ్ – ది బ్లడ్ వుడ్’ (Udhiram the Blood Wood) నుంచి తొలి పాట ‘అలాకా లూవా’ (Alaka Luva) విడుదలైంది. విడుదలైన కాసేపటికే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. మాస్ బీట్‌, ఎనర్జిటిక్ వోకల్స్‌, ధనుష్ స్టైలిష్ (Dhanush Stylish) డ్యాన్స్ మూవ్స్ ఈ పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఫస్ట్ సాంగ్‌తోనే మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది.

ఈ పాటకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ (Sai Abhyankar) సంగీతం అందించడమే కాకుండా స్వయంగా ఆలపించారు. తెలుగు వెర్షన్‌లో రామ్ మిరియాల, అరుణ్ కౌండిన్య గాత్రం అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ సాంగ్ ఇప్పటికే అభిమానుల ప్లేలిస్టులో చేరిపోయింది.

ఇప్పటికే విడుదలైన ‘ఫస్ట్ స్ట్రైక్’ (First Strike) టీజర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్ మాస్ లుక్ అభిమానులను ఫుల్‌గా ఆకట్టుకుంటోంది. ప్రతి అప్డేట్‌తో సినిమా అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘మారి 2’(Maari) 2 తర్వాత ధనుష్, సాయి పల్లవి మరోసారి జోడీగా కనిపించనుండగా, శ్రీలీల కూడా ముఖ్యమైన పాత్రలో సందడి చేయనుంది. ‘అమరన్’ ఫేమ్ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్-టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 16న విజయదశమి కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment