టైటిల్: పెద్ది
నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ
దర్శకత్వం: బుచ్చిబాబు
సంగీతం: ఏఆర్ రెహమాన్
విడుదల తేది: జూన్ 4, 2026
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’(Peddi) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కించిన మూవీ కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏఆర్ రెహమాన్ (A. R. Rahman) సంగీతం కూడా సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది.
కథ ఏంటంటే..
1990ల నేపథ్యంలో విజయనగరం (Vizianagaram) దగ్గర ఉన్న ఓ చిన్న గ్రామంలో కథ సాగుతుంది. 450 కుటుంబాలు ఉన్నా ఆ ఊరికి సరైన గుర్తింపు ఉండదు. ఊరికి రైల్వే స్టేషన్ (Railway Station) రావాలని అప్పల సూరి (Appala Suri) 30 ఏళ్లుగా ప్రయత్నిస్తుంటాడు. ఇదే సమయంలో పెద్ది అనే యువకుడు కూలీ పనులు చేస్తూ క్రికెట్ (Cricket) ఆడుతూ పేరు సంపాదిస్తాడు. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడం అతని ప్రత్యేకత. అయితే ఓ కారణంతో క్రికెట్‌ను వదిలి కుస్తీ (Wrestling) నేర్చుకోవాల్సి వస్తుంది. చివరకు ఊరి గుర్తింపుకోసం అతడు చేసిన పోరాటమే సినిమా కథ.
సినిమా ఎలా ఉందంటే..
దర్శకుడు బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ (Emotional) కథను చెప్పే ప్రయత్నం చేశాడు. క్రికెట్(Cricket), కుస్తీ(Wrestling), రన్నింగ్ (Running) వంటి 3 క్రీడలను కథలో భాగం చేయడం కొత్తగా అనిపిస్తుంది. అయితే కథలో కొన్ని సన్నివేశాలు ముందే ఊహించేలా సాగుతాయి.మొదటి భాగం కాస్త నెమ్మదిగా ప్రారంభమైనా.. రామ్ చరణ్ ఎంట్రీ తర్వాత సినిమా ఆసక్తికరంగా మారుతుంది. జగపతి బాబు (Jagapathi Babu) పాత్రతో వచ్చే ఎమోషనల్ సీన్లు బాగుంటాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంటుంది.సెకండాఫ్‌లో కుస్తీ ఎపిసోడ్స్, ఊరి కోసం హీరో చేసే పోరాటం సినిమాకు ప్రధాన బలం. క్లైమాక్స్ భావోద్వేగంగా సాగుతుంది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమా పూర్తిగా రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. క్రికెటర్‌గా, కుస్తీ ఆటగాడిగా, రన్నర్‌గా 3 వేరియేషన్స్‌లో చరణ్ ఆకట్టుకున్నాడు. జగపతి బాబు తన పాత్రలో బాగా నటించాడు. శివరాజ్ కుమార్ (Shivarajkumar) పాత్ర కూడా గుర్తుండిపోతుంది.జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అందంగా కనిపించింది. కానీ కథలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే..
ఏఆర్ రెహమాన్ (A. R. Rahman) నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. రత్నవేలు (R. Rathnavelu) సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను అద్భుతంగా చూపించింది. నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్‌గా కనిపిస్తాయి.
ఫైనల్‌గా..
మొత్తంగా ‘పెద్ది’ ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. కథలో కొన్ని రొటీన్ సన్నివేశాలు ఉన్నా.. రామ్ చరణ్ నటన, ఎమోషన్స్, సంగీతం సినిమాను నిలబెట్టాయి.
రేటింగ్: 3/5






