---Advertisement---

Peddi Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ‘పెద్ది’ అఫీషియల్ ట్రైలర్ విడుదల…

May 18, 2026

Summarize with AI

---Advertisement---

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’పై(Peddi) ప్రేక్షకుల్లో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడం, అలాగే ‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు (Buchi Babu Sana) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సినిమా ప్రకటించిన రోజు నుంచే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు (Release) సిద్ధమైంది. జూన్ 3 సాయంత్రం ప్రత్యేక ప్రీమియర్స్ కూడా ప్రదర్శించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రిలీజ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మూవీ టీం, ముంబైలో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ను మీడియా ప్రతినిధులు, ట్రేడ్ వర్గాలకు ప్రదర్శించింది.

ఆ తర్వాత అధికారికంగా యూట్యూబ్‌లో ట్రైలర్‌ను (Trailer) విడుదల చేశారు. ట్రైలర్‌లో రామ్ చరణ్ పూర్తి మాస్ అవతార్‌లో కనిపిస్తూ అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాడు. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ముఖ్యంగా బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్, గ్రామీణ బ్యాక్‌డ్రాప్ విజువల్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి.

ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వస్తుండగా, అభిమానులు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. విడుదల తర్వాత ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment