---Advertisement---

‘పెద్ది’ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్.. పోస్టర్‌తోనే అంచనాలు పెంచేసిన రామ్ చరణ్!

May 11, 2026

Summarize with AI

---Advertisement---

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చి బాబు సానా(Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’(Peddi)పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై భారీ హైప్ తీసుకురాగా.. ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. మే 18న ‘పెద్ది’ ట్రైలర్ (Trailer) విడుదల కానుందని వెల్లడించింది.

రా అండ్ రస్టిక్ లుక్‌తో ఆకట్టుకున్న రామ్ చరణ్

ట్రైలర్ అప్‌డేట్‌తో పాటు విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో రామ్ చరణ్ వెనుక మంచం మోసుకుంటూ, చేతిలో ట్రంక్ పెట్టె, మరో చేతిలో VIP అని రాసిన కవర్ పట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతున్న లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ రఫ్ అండ్ మాస్ అవతార్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేసింది.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు(Jagapathi Babu), దివ్యేందు శర్మ(Divyenndu Sharma), సాయి కుమార్(Sai Kumar), శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం మెగా అభిమానులు ట్రైలర్ కోసం సోషల్ మీడియాలో కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment