గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్దిపై(Peddi) ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఆ అంచనాలను మరింత పెంచేస్తూ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ప్రత్యేకంగా ట్రైలర్‌ను వీక్షించిన చిరంజీవి.. అది దాదాపు 3 నిమిషాల నిడివితో పూర్తిస్థాయి ఫైర్ పవర్‌లా ఉందంటూ ప్రశంసలు కురిపించారు.
ట్రైలర్‌లో (Trailer) రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, బుచ్చిబాబు విజన్, సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ (A.R. Rahman) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని చిరంజీవి తెలిపారు. అభిమానులు ఎంతగా ఊహించుకున్నా.. దానికి 100 రెట్లు ఎక్కువగా ఈ ట్రైలర్ ఉండబోతుందని ఆయన చెప్పడంతో సోషల్ మీడియాలో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎమోషన్, యాక్షన్, గూస్‌బంప్స్ తెప్పించే ఎలివేషన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని ఆయన రివ్యూ ఇచ్చారు.
చిరంజీవికి ఏదైనా కంటెంట్ బాగా నచ్చితే అందులోని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకోవడం అలవాటు. చాలా రోజుల తర్వాత తన ట్రేడ్‌మార్క్ #ChiruLeaks ను మళ్లీ బయటకు తీసుకొచ్చారు. ట్రైలర్ చూసిన ఉత్సాహంలో అందులోని ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ను (Powerful Dialogue) కూడా లీక్ చేశారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు…” అంటూ సాగే ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
ఈ ఒక్క డైలాగ్‌తోనే సినిమాలో రామ్ చరణ్ పాత్రలో ఉండే ఎమోషనల్ స్ట్రగుల్, క్రీడా నేపథ్యం, ఇంటెన్సిటీ ఏ స్థాయిలో ఉండబోతుందో అభిమానులు అంచనా వేస్తున్నారు. చివర్లో “సారీ (Sorry) బుచ్చిబాబు… ట్రైలర్ చూశాక కంట్రోల్ తప్పా” అంటూ దర్శకుడికి చిరంజీవి సరదాగా క్షమాపణ చెప్పడం కూడా అభిమానులను ఆకట్టుకుంది.
#PeddiTrailer చూసాను!! 🔥
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 16, 2026
Just… WOW 🤗🤗🤗
3 నిమిషాలు…
PURE FIREPOWER PACKED TRAILER!! ✨
చరణ్… బుచ్చి… రెహమాన్…
ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡
ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.
Emotion… Elevation… Madness… అన్నీ next…
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇప్పుడు స్వయంగా చిరంజీవి ఇచ్చిన రివ్యూ, లీక్ చేసిన డైలాగ్‌తో పెద్ది ట్రైలర్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.






