---Advertisement---

PEDDI Trailer: టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న ‘పెద్ది’ ట్రైలర్.. వ్యూస్ చూస్తే మైండ్ బ్లాంక్!

May 19, 2026

---Advertisement---

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’(Peddi) ట్రైలర్ (Trailer) విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాను ఊపేస్తోంది. థియేటర్లలో సినిమా విడుదలకాకముందే ఈ మూవీ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతోంది. ముఖ్యంగా ట్రైలర్‌లో రామ్ చరణ్ చూపించిన మాస్ అవతార్, ఎమోషనల్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అభిమానులు అయితే థియేటర్లలో పూనకాలు ఖాయం అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను మే 18న విడుదల చేశారు. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే యూట్యూబ్‌లో ప్రేక్షకులు ఎగబడి చూస్తుండటంతో వ్యూస్ పరంగా దుమ్మురేపుతోంది. కేవలం కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ 1.67 కోట్ల వ్యూస్ సాధించడం విశేషం. అంతేకాదు 4 లక్షలకు పైగా లైక్స్ దక్కించుకోవడంతో పాటు 63 మిలియన్ల రియల్ టైమ్ వ్యూస్ నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం యూట్యూబ్ టాప్ ట్రెండింగ్‌లో ‘పెద్ది’ ట్రైలర్ దూసుకుపోతోంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ గ్రామీణ నేపథ్యంలోని క్రీడాకారుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన లుక్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా, టాలీవుడ్ వర్సటైల్ నటుడు జగపతి బాబు, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రస్తుతం ఈ భారీ చిత్రానికి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ట్రైలర్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న (June 4) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment