---Advertisement---

Prabhas: ‘బాహుబలి 3 వస్తుంది’.. సంచలన ప్రకటన చేసిన ప్రభాస్!

June 26, 2026

Summarize with AI

---Advertisement---

దర్శకధీరుడు రాజమౌళి (S. S. Rajamouli) తెరకెక్కించిన బాహుబలి (Baahubali) సిరీస్ భారతీయ సినీ చరిత్రలోనే ఒక సంచలనంగా నిలిచిన విషయం తెలిసిందే. 2 భాగాలుగా విడుదలైన ఈ చిత్రం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ప్రభాస్(Prabhas), రానా(Rana), అనుష్క(Anushka), తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ విజువల్ వండర్ తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటికీ బాహుబలి గురించి ప్రేక్షకుల్లో అదే స్థాయి క్రేజ్ కొనసాగుతుండగా తాజాగా వచ్చిన ఒక అప్‌డేట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా బాహుబలి ది టార్చ్ బేరర్ (Baahubali: The Torch Bearer) స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో విడుదల చేసిన ప్రత్యేక ప్రమోషనల్ వీడియోలో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు బాహుబలి 3 రాబోతోందని స్వయంగా ప్రకటించారు. మీ అందరి కోసం బాహుబలి 3 (Baahubali 3) వస్తోంది అంటూ ప్రభాస్ చెప్పిన మాటలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ వీడియోను భారీగా షేర్ చేస్తున్నారు.

బాహుబలి 3 ప్రకటనతో సోషల్ మీడియా మొత్తం సందడి వాతావరణంలో మునిగిపోయింది. చాలా కాలంగా బాహుబలి ఫ్రాంచైజీ కొనసాగుతుందా లేదా అనే సందేహాల్లో ఉన్న అభిమానులకు ఈ ప్రకటన భారీ గుడ్ న్యూస్‌గా మారింది. సినిమా గురించి మరిన్ని వివరాలు ఎప్పుడు వెల్లడిస్తారనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది.

ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ఫౌజీ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు యువ హీరోల సినిమాలకు మద్దతు ఇస్తూ ప్రమోషన్స్‌లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు.

అయితే గత కొంతకాలంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లు రావడం ఆలస్యం అవుతుండటంతో ప్రభాస్ అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇతర చిత్రాల ప్రమోషన్స్‌లో కనిపిస్తున్న ప్రభాస్, తన ప్రాజెక్టుల గురించి కూడా తరచూ సమాచారం ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఎప్పుడెప్పుడు కొత్త అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న సమయంలో బాహుబలి 3 అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ప్రస్తుతం బాహుబలి 3 ప్రకటనకు సంబంధించిన వీడియో అన్ని సోషల్ మీడియా వేదికల్లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇప్పుడు అభిమానుల దృష్టంతా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వివరాలు, షూటింగ్ ప్రారంభం, విడుదల తేదీ వంటి తదుపరి అప్డేట్లపైనే ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment