ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’(Fauji) సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే డిసెంబర్ 3న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించగా.. రిలీజ్ పోస్టర్లో ప్రభాస్ వార్ఫీల్డ్ లుక్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో చూపించబోతున్నాడనే సంకేతాలు ఫస్ట్ లుక్‌తోనే స్పష్టంగా కనిపించాయి.
ఇప్పుడు అందరి దృష్టి ‘ఫౌజీ’ టీజర్‌పైనే ఉంది. తాజా సమాచారం ప్రకారం స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా ఆగస్టు 15న టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టీజర్లో యాక్షన్, విజువల్స్, ఎమోషన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీజర్ విడుదల (Teaser Release) తర్వాత సినిమా ప్రమోషన్స్‌ను మరింత వేగంగా కొనసాగించేందుకు టీమ్ సిద్ధమవుతోంది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ (Imanvi) హీరోయిన్గా నటిస్తుండగా.. ఆమె పాత్ర కథలో కీలక మలుపు తీసుకురానుందని సమాచారం. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా.. మిగిలిన భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చిత్రబృందం కసరత్తులు చేస్తోంది. మరోవైపు ‘స్పిరిట్’ షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే ‘ఫౌజీ’ సెట్స్‌లోకి తిరిగి అడుగుపెట్టనున్నాడు. ‘ఫౌజీ’(Fauji), ‘స్పిరిట్’(Spirit) సినిమాలతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు డార్లింగ్ రెడీ అవుతున్నాడు.






