---Advertisement---

CWG 2026: కామన్వెల్త్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. బాక్సింగ్‌లో ప్రీతి పవార్ పంచ్‌ల పవర్..!

August 1, 2026

Summarize with AI

---Advertisement---

2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో (Glasgow Commonwealth Games) భారత బాక్సింగ్ (Indian Boxing) సంచలనం ప్రీతి పవార్ (Preeti Pawar) అదిరిపోయే ప్రదర్శనతో దేశానికి మరో స్వర్ణ పతకాన్ని (Gold Medal) అందించింది. మహిళల 54 కేజీల బ్యాంటమ్‌వెయిట్ (Women’s 54kg Bantamweight Category) విభాగం ఫైనల్‌లో కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నాపై (Scarlett Savanna) 5-0 తేడాతో ఏకగ్రీవ నిర్ణయంతో ఘన విజయం సాధించింది. కేవలం 22 ఏళ్ల ప్రీతి తొలి రౌండ్ నుంచే రింగ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కచ్చితమైన పంచ్‌లు(Accurate Punches), వేగవంతమైన ఫుట్‌వర్క్‌తో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ మొత్తాన్ని తన నియంత్రణలో ఉంచి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది.

తొలి రౌండ్‌లోనే ఐదుగురు జడ్జిల నుంచి 10-8 స్కోర్‌తో ఆధిక్యం సాధించిన ప్రీతి, చివరి వరకు అదే దూకుడును కొనసాగించింది. ప్రతి రౌండ్‌లోనూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సింగ్ ఖాతాలో మరో స్వర్ణ పతకాన్ని జోడించింది.

ఈ టోర్నీలో ఒక్క రౌండ్ కూడా కోల్పోకుండా ప్రీతి ఫైనల్‌కు చేరుకోవడం మరో విశేషం. తొలి పోరులో స్కాట్లాండ్‌కు చెందిన నియామ్ హ్యూస్టన్‌ను (Niamh Houston) ఓడించిన ఆమె, క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాకు చెందిన టీనా రహీమీపై (Tina Rahimi) విజయం సాధించింది. సెమీఫైనల్లో జాంబియాకు చెందిన కేథరిన్ మ్వాపేపై 5-0తో గెలిచి గోల్డ్ మెడల్ పోరుకు అర్హత సాధించింది. ప్రపంచ బ్యాంటమ్‌వెయిట్ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానంలో ఉన్న ప్రీతి తన అద్భుత ఫామ్‌ను మరోసారి నిరూపించింది.

అంతర్జాతీయ వేదికలపై వరుస విజయాలతో ప్రీతి పవార్ భారత బాక్సింగ్‌లో కీలక శక్తిగా ఎదిగింది. 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో (2026 Asian Boxing Championships) స్వర్ణ పతకం సాధించిన ఆమె, 2025 వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్‌లోనూ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. 2023 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించడంతో పాటు 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. అలాగే 2022 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం, 2024 ఆసియా అండర్-22 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణంతో తన విజయాల జాబితాలో మరో అరుదైన ఘనతను చేర్చుకుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment