---Advertisement---

గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ టైటిల్ కైవసం చేసుకున్న ఆర్. ప్రజ్ఞానంద!

August 7, 2026

Summarize with AI

---Advertisement---

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద (R. Praggnanandhaa) మరోసారి చరిత్ర సృష్టించాడు. అమెరికాలో (USA) జరిగిన ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ (Grand Chess Tour) సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ (Saint Louis Rapid & Blitz) టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. చివరి రౌండ్‌కు ముందు జవోఖిర్ సిందరోవ్‌తో (Javokhir Sindarov) జరిగిన మ్యాచ్‌ను డ్రాగా ముగించిన ప్రజ్ఞానంద, మరో రౌండ్ మిగిలి ఉండగానే టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు.

ఈ టోర్నీలో మొత్తం 35 పాయింట్లకు గాను 23 పాయింట్లు సాధించిన ప్రజ్ఞానంద, తన సమీప ప్రత్యర్థుల కంటే 1.5 పాయింట్ల ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రజ్ఞానంద కెరీర్‌లో ఇదే తొలి ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్ టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో అంతర్జాతీయ చెస్ వేదికపై తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు.

ఇటీవల జూన్‌లో ఓస్లోలో జరిగిన నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో వరుసగా 4 విజయాలు సాధించి ఛాంపియన్‌గా నిలిచిన ప్రజ్ఞానానంద, ఇప్పుడు సెయింట్ లూయిస్ టైటిల్‌తో తన అద్భుతమైన ఫామ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. తక్కువ వ్యవధిలోనే 2 ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చెస్ టైటిళ్లను సాధించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచాడు.

ఈ విజయంపై తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (C. Joseph Vijay) ప్రజ్ఞానందను అభినందించడంతో పాటు రూ. 50 లక్షల నగదు బహుమతిని అందజేశారు. వరుస విజయాలతో భారత చెస్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచుతున్న ప్రజ్ఞానందపై క్రీడా ప్రపంచం, అభిమానులు, సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment