రాజకీయ ప్రవేశంపై మరోసారి స్పందించిన ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి విజయ్(CM Vijay) రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ (Tiruchi East Constituency) ఉప ఎన్నికలో (By-Election) మాత్రం తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే(MLA) లేదా మంత్రి (Minister) కావాలనే తొందర తనకు లేదని, ఏ రాజకీయ పార్టీలో చేరాలన్న నిర్ణయాన్ని కూడా హడావుడిగా తీసుకోనని వెల్లడించారు.
రాజకీయాలు కూరగాయల మార్కెట్ కాదని, ఎక్కడ ఉన్నా గౌరవం ఉండాలని వ్యాఖ్యానించిన లారెన్స్ ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా సామాజిక సేవా కార్యక్రమాలు, సినిమా ప్రాజెక్టులపైనే ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఇప్పట్లో లేదని స్పష్టం చేస్తూ, “నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి.. ప్రతిఫలంగా దేనినీ ఆశించకు” అనే సందేశంతో వీడియో విడుదల చేశారు. తనకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ప్రజలను కుక్కలతో పోల్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంపై కూడా లారెన్స్ స్పందించారు. తాను అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదని, తన మాటలను తప్పుగా ప్రచారం చేశారని స్పష్టం చేశారు.
Do your duty. Don’t expect anything in return.
— Raghava Lawrence (@offl_Lawrence) June 30, 2026
As announced earlier, here is my clarification regarding the Trichy election and my recent press meet.
Thank you all for your love and support 🙏🏼#serviceisgod pic.twitter.com/JlIlkxVKdr
ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్(Perambur), తిరుచ్చి ఈస్ట్ (Tiruchi East) స్థానాల నుంచి విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.
ఈ ఉప ఎన్నికలో టీవీకే(TVK) తరఫున నటి త్రిష (Trisha) పోటీ చేసే అవకాశాలపై ప్రచారం జరుగుతుండగా, రాఘవ లారెన్స్ పేరు కూడా వినిపించింది. అయితే తాను పోటీ చేయబోనని లారెన్స్ స్వయంగా ప్రకటించడంతో, త్రిష బరిలోకి దిగే అవకాశాలు మరింత బలపడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అధికారిక అభ్యర్థిని టీవీకే ప్రకటించే వరకు ఉత్కంఠ కొనసాగనుంది.






