---Advertisement---

Raghava Lawrence: రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్..పరిస్థితులే ఈ నిర్ణయానికి కారణమంటూ సంచలన పోస్ట్‌.

June 12, 2026

---Advertisement---

తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) రోజురోజుకీ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తిరుచ్చి ఈస్ట్ (Tiruchi East) అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో కొత్త రాజకీయ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) రాజకీయాల్లోకి ఎంట్రీ (Politics Entry) ఇవ్వబోతున్నారనే వార్తలు ఇప్పుడు తమిళ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్టు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

రాఘవ లారెన్స్ తన పోస్టులో మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ నిజాయితీగా (Honestly) జీవిస్తూ నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలనే ఆలోచనతోనే ముందుకు సాగాను. కానీ ఒకరోజు రాజకీయాల్లోకి వస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించాలనే ఆశ గానీ, పెద్ద పదవులు పొందాలనే కోరిక గానీ నాకు ఎప్పుడూ లేదు” అని వెల్లడించారు.

అలాగే తాను విశ్వసించిన ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఆయనకు మద్దతుగా నిలబడి, ప్రస్తుతం చేస్తున్న సేవా కార్యక్రమాల (Service Activities) కంటే మరింత పెద్ద స్థాయిలో ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశమే తనలో ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులే తనను రాజకీయాల వైపు ఆలోచించేలా చేశాయని లారెన్స్ పేర్కొన్నారు.

రాజకీయాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకుంటూ.. “రాజకీయాలు (Politics) నా జీవితంలోకి ఎలా వచ్చాయి..? రాజకీయాలపై నా తల్లి(Mother) అభిప్రాయం ఏంటి..? నా జీవిత ప్రయాణాన్ని మార్చిన ముఖ్యమైన సంఘటనలు ఏమిటి..? అనే విషయాలన్నింటినీ నేను ఓ వీడియోలో నిజాయితీగా వెల్లడించాను” అని తెలిపారు.

అంతేకాకుండా ప్రజలకు ఆయన ఒక ప్రత్యేక విజ్ఞప్తి కూడా చేశారు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని కోరారు. తన వీడియో చూసిన తర్వాత ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఒకవేళ ప్రజలు రాజకీయాల్లోకి రావద్దని చెబితే తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగానే ఉంటానని స్పష్టం చేశారు. అయితే ప్రజలు తనను రాజకీయాల్లో చూడాలని కోరుకుంటే మాత్రం అందరి ఆశీస్సులతో కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

రాఘవ లారెన్స్ చేసిన ఈ ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చలు వేడెక్కాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ తరపున ఆయన ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలపై ఇప్పుడు భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment