---Advertisement---

రాయదుర్గం భూమికి భారీ డిమాండ్.. ఎకరాకు ఏకంగా రూ.264 కోట్లు!

August 21, 2026

Summarize with AI

---Advertisement---

హైదరాబాద్ (Hyderabad) రియల్ ఎస్టేట్ (Real Estate) మార్కెట్‌లో మరో సంచలన రికార్డు నమోదైంది. రాయదుర్గం (Raidurg) ఐటీ కారిడార్‌లోని (IT Corridor) భూమికి వేలంలో(Auction) ఊహించని ధర పలికింది. తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC) నిర్వహించిన వేలంలో ప్లాట్ నంబర్ (Plot No.) P1కు ఎకరాకు ఏకంగా రూ.264 కోట్ల ధర దక్కింది.

రాయదుర్గంలోని ఈ ప్లాట్ మొత్తం 5.25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఎకరాకు రూ.264 కోట్ల చొప్పున లెక్కిస్తే మొత్తం భూమి విలువ సుమారు రూ.1,386 కోట్లుగా తేలింది. దీంతో హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన భూముల విక్రయాల్లో రాయదుర్గం మరోసారి వార్తల్లో నిలిచింది.

ఈ భారీ స్థలాన్ని ఎంఎస్ఎన్ రియాల్టీస్ (MSN Realty) సంస్థ పోటీపడి దక్కించుకుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాయదుర్గంలో జరిగిన ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది.

రాయదుర్గం ఇప్పటికే హైదరాబాద్‌లో కీలకమైన ఐటీ, వాణిజ్య కేంద్రంగా కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఐటీ సంస్థల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు వేగంగా పెరుగుతుండటంతో భూములకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ప్రభావమే తాజా వేలంలో ఎకరాకు రూ.264 కోట్ల రికార్డు ధర పలకడానికి ప్రధాన కారణంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment