బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితీష్ తివారీ (Nitesh Tiwari) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణ’పై(Ramayana) ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించగా.. తాజాగా ఈ సినిమా నుంచి తొలి పాట ‘జై జై రామ్’(Jai Jai Ram)ను తెలుగులో(Telugu) విడుదల చేశారు.
దైవభక్తి, మధురమైన సంగీతం, అద్భుతమైన విజువల్స్‌ను మేళవిస్తూ ‘జై జై రామ్’ పాటను రూపొందించారు. విడుదలైన వెంటనే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ పాటకు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది.
నిర్మాత నమిత్ మల్హోత్రా(Namit Malhotra) అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణాసురుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణకగా కనిపించనున్నారు.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ తొలి భాగాన్ని నవంబర్ 6న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.







