---Advertisement---

అడ్డతీగల టీడీపీ సమావేశంలో రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి ఫైర్.. సొంత కార్యకర్తలకు వార్నింగ్!

September 17, 2026

Summarize with AI

---Advertisement---

అడ్డతీగలలో జరిగిన టీడీపీ(TDP) సమావేశంలో రంపచోడవరం ఎమ్మెల్యే(Rampachodavaram MLA) మిరియాల శిరీష దేవి (Miriyala Sireesha Devi) సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలను సమీకరించలేకపోవడం, ఎన్నికల్లో ఓట్లు వేయించలేకపోవడం, తనపై అధిష్టానానికి ఫిర్యాదులు చేయడంపై ఆమె మండిపడ్డారు. “నా మీదే కంప్లైంట్(Complaint) ఇస్తారా.. ఒక్కొక్కరికి తాట తీస్తా” అంటూ హెచ్చరించారు.

పార్టీ కార్యక్రమాలకు కనీసం ఫ్లెక్సీలు (Flexes) కూడా కట్టించడం లేదంటూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో రంపచోడవరం టీడీపీ(TDP) వర్గాల్లో అంతర్గత విభేదాలపై చర్చ మొదలైంది. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ కార్యకర్తల (Senior Party Workers) పట్ల ఈ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయంటూ కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు(Local Body Elections) సన్నద్ధమవుతున్న వేళ సొంత పార్టీ నేతలపైనే ఎమ్మెల్యే బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment