---Advertisement---

Rashmika Mandanna: సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన రష్మిక మందన్న.!

July 31, 2026

Summarize with AI

---Advertisement---

రశ్మిక మందన్నకు (Rashmika Mandanna) ఊహించని షాక్ తగిలింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్ డ్యాన్స్ షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ‘రణబాలి’(Ranabali), ‘మైసా’(Mysa) చిత్రాల షూటింగ్స్‌లో (Shootings) పాల్గొంటున్న రశ్మికకు హిప్ (Hip) ప్రాంతంలో టెండన్ (Tendon) పూర్తిగా డిటాచ్ (Detached) అయినట్లు వైద్యులు వెల్లడించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో కూడా ఆందోళన నెలకొంది.

వైద్యుల ప్రకారం ఈ తరహా గాయాలు సాధారణంగా కఠినమైన శారీరక శ్రమ చేసే క్రీడాకారుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. వరుసగా యాక్షన్ సన్నివేశాలు(Action Scenes), డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు (Dance Performances) చేయడం వల్ల శరీరంపై అధిక ఒత్తిడి పడటంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రశ్మిక కనీసం 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. అంతేకాకుండా పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ప్రత్యేక రీహాబిలిటేషన్ కూడా అవసరమని చెబుతున్నారు.

ప్రస్తుతం రశ్మిక చేతిలో 4 భారీ పాన్ ఇండియా సినిమాలు ఉండగా, దాదాపు 30 ప్రముఖ బ్రాండ్లకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. ఈ గాయం కారణంగా సినిమాల షూటింగ్స్‌తో పాటు పలు యాడ్ షూటింగ్స్ కూడా తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రశ్మిక త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి రావాలని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment