---Advertisement---

IRUMUDI: రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్..అధికారికంగా ప్రకటించిన మేకర్స్

June 7, 2026

---Advertisement---

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా, ప్రియ భవాని శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్‌గా, దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’(Irumudi) విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను 2026 ఆగస్టు 21న (August 21, 2026) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇటీవల విడుదలైన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’(The Heart of Irumudi) గ్లింప్స్‌కు (Glimpse) ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్‌ను (Release Date) ప్రకటించింది. భక్తి, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తి స్థాయి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో రవితేజ ప్రేమాభిమానాలు కలిగిన తండ్రి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు పెద్దపీట వేసిన కథతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.

వరుస అపజయాల తర్వాత రవితేజ కెరీర్‌కు ‘ఇరుముడి’ కీలక చిత్రంగా మారింది. ముఖ్యంగా శివ నిర్వాణ దర్శకత్వం, ఎమోషనల్ కథాంశం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment