---Advertisement---

క్వాలిఫయర్-1లో GTపై బెంగుళూరు ఘన విజయం.. ఫైనల్స్ కి దూసుకెళ్లిన RCB

May 27, 2026

Summarize with AI

---Advertisement---

ఐపీఎల్ 2026(IPL 2026) తొలి క్వాలిఫైయర్ (Qualifier-1) మ్యాచ్‌లో బెంగుళూరు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. గుజరాత్ టైటాన్స్‌పై(GT) 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చాటిన బెంగుళూరు జట్టు(RCB) మ్యాచ్ మొత్తాన్ని ఏకపక్షంగా మార్చేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు(RCB) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ (Rajat Patidar) 93 పరుగులతో చెలరేగి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి దూకుడు ఇన్నింగ్స్‌తో బెంగుళూరు భారీ స్కోర్ దిశగా పయనించింది. చివరి ఓవర్లలో బ్యాటర్లు వేగంగా పరుగులు రాబట్టి ప్రత్యర్థికి కఠిన లక్ష్యాన్ని నిర్దేశించారు.

255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ 14, శుభమన్ గిల్ 2 పరుగులకే పెవిలియన్ చేరడంతో జట్టు ఒత్తిడిలో పడింది. అనంతరం వచ్చిన జోస్ బట్లర్ 29 పరుగులతో పోరాడే ప్రయత్నం చేసినా హేజల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

బెంగుళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ ఒక దశలో 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పూర్తిగా కుదేలైంది. రాహుల్ తెవాతియా (Rahul Tewatia) 68 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లలేకపోయాడు. చివరకు గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది.

ఈ ఘన విజయంతో బెంగుళూరు నేరుగా ఫైనల్‌కు(Final) అర్హత సాధించింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్-2లో తలపడనుంది. కాగా రేపు హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment