---Advertisement---

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి!

September 23, 2026

Summarize with AI

---Advertisement---

కాపు యువకుడు గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) లాకప్ డెత్ (Lockup Death) కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. వైఎస్సార్‌సీపీ(YSRCP) తిరుపతి ఎంపీ గురుమూర్తి(Gurumurthy) దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించిన విచారణలో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుపై ధర్మాసనం తీవ్ర ప్రశ్నలు సంధించింది. సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడం, డీజీపీకి(DGP) ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు ఆలస్యం కావడం, సాయికృష్ణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకపోవడం వంటి అంశాలపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

“డీజీపీ నిద్రపోతున్నారా?”, “సీసీటీవీలు ఎలా పనిచేయకుండా ఉంటాయి? ఎందుకు మాయం అయ్యాయి?” అంటూ ప్రశ్నలు వేసినట్లు పిటిషనర్ తరఫు వాదనలు పేర్కొన్నాయి. సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని రాష్ట్రం అంగీకరిస్తున్నప్పటికీ, ఆయన ఆచూకీ, మృతదేహం లభించకపోవడంపై కూడా ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. ఈ కేసుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court) పెండింగ్‌లో ఉన్న మూడు పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది.

సెప్టెంబర్ 30లోగా కేసు రికార్డులను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను అక్టోబర్ 12, 2026కు వాయిదా వేసింది. సీబీఐని పక్షంగా చేర్చాలన్న విజ్ఞప్తిపై తదుపరి విచారణలో పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment