---Advertisement---

Sardar 2 Teaser: కార్తీ ‘సర్దార్ 2’ తెలుగు టీజర్ రిలీజ్..!

July 31, 2026

Summarize with AI

---Advertisement---

టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సర్దార్ 2 (Sardar 2) నుంచి అదిరిపోయే టీజర్(Teaser) విడుదలైంది. కార్తి (Karthi) హీరోగా, పి.ఎస్. మిత్రన్ (P. S. Mithran) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసుకుంది. ఫస్ట్ పార్ట్ సాధించిన విజయాన్ని మించి ఈసారి మరింత గ్రాండ్ స్కేల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టీజర్ స్పష్టంగా చూపించింది. హై వోల్టేజ్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్, ఊహించని ట్విస్టులతో టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

టీజర్ ప్రారంభంలోనే ఎస్.జె. సూర్య (S. J. Suryah) చెప్పే “ఇద్దరు స్పైలు.. ఒక తండ్రి, ఒక కొడుకు” అనే వాయిస్ ఓవర్ కథపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. తండ్రిగా రగ్డ్ లుక్‌లో, కొడుకుగా స్టైలిష్ అవతార్‌లో కార్తి డ్యూయల్ రోల్‌లో అదరగొట్టబోతున్నాడని టీజర్ క్లియర్ హింట్ ఇచ్చింది. రెండు పాత్రల్లోనూ కార్తి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా కనిపిస్తోంది.

అయితే ఈ టీజర్‌లో అసలు షో స్టీలర్ ఎస్.జె. సూర్య (S. J. Suryah) అని చెప్పాలి. స్టైలిష్ లుక్, డిఫరెంట్ మేనరిజమ్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో విలన్ పాత్రను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. “టెక్నికల్లీ నేనే మంచివాడిని.. వాళ్లే బ్యాడ్ గైస్” అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. యాక్షన్ సీన్స్‌లో కూడా ఆయన ప్రెజెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ప్రిన్స్ పిక్చర్స్ (Prince Pictures) నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ (Sam C. S.) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు భారీ ఎలివేషన్ ఇచ్చింది. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ 10 సెప్టెంబర్ 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో వస్తున్న సర్దార్ 2 బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment