---Advertisement---

Sekhar Master: సుమలత, లక్ష్మిపై శేఖర్ మాస్టర్ ఫైర్.. బహిరంగ క్షమాపణకు డిమాండ్!

September 5, 2026

Summarize with AI

---Advertisement---

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్(Shekar Master) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పుట్టు పూర్వోత్తరాల (Background) గురించి జానీ మాస్టర్ భార్య (Jani Master Wife) సుమలత(Sumalatha), సీనియర్ డ్యాన్సర్ లక్ష్మి (Lakshmi) ఇష్టానుసారంగా మాట్లాడారని ఆయన ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫెడరేషన్‌తో(Federation) పాటు డ్యాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్‌కు (Raghu Master) అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు శేఖర్ మాస్టర్ తెలిపారు.

గత కొంతకాలంగా తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, తన మనోభావాలు దెబ్బతినేలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలు, ఎటకారపు వ్యాఖ్యలు తనను మానసికంగా ఎంతో బాధించాయని పేర్కొన్నారు. తనకు ఎలాంటి సంబంధం లేని విషయాల్లోకి తనను లాగుతూ, పుట్టు పూర్వోత్తరాలపై దారుణంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు.

ఈ వివాదాలను మరింత పెంచవద్దని, మీడియా ముందుకు వెళ్లొద్దని పరిశ్రమ పెద్దలు (Industry Elders) సూచించడంతోనే ఇన్నాళ్లూ తాను సంయమనం పాటించానని శేఖర్ మాస్టర్ స్పష్టం చేశారు. పెద్దల పట్ల ఉన్న గౌరవంతోనే ఇంతకాలం మౌనంగా ఉన్నానని, అయితే సుమలత ప్రవర్తన, ఆమె చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని తెలిపారు.

తన యూనియన్ సభ్యుల సంక్షేమం (Union Members Welfare) కోసం తాను ఎప్పుడూ ముందుంటానని శేఖర్ మాస్టర్ గుర్తుచేశారు. డ్యాన్సర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు, వారికి పర్సంటేజీల (Percentages) విషయంలో అన్యాయం జరుగుతోందని భావించిన సందర్భాల్లో వారి హక్కుల కోసం ఎన్నో మంచి అవకాశాలను, హిట్ సాంగ్స్‌ను సైతం వదులుకున్నానని వెల్లడించారు.

యూనియన్ సంక్షేమం కోసం నిలబడిన తనపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని శేఖర్ మాస్టర్ అన్నారు. తనపై ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపించిన సుమలత, సీనియర్ డ్యాన్సర్ లక్ష్మి వెంటనే తనకు బహిరంగంగా క్షమాపణలు (Publicly Apology) చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment