---Advertisement---

శ్రీసిటీలో పేలుడు.. నలుగురు మృతి, మరింత పెరగనున్న మృతుల సంఖ్య?

October 3, 2026

Summarize with AI

---Advertisement---

తిరుపతి జిల్లా (Tirupati District) సత్యవేడు మండలం శ్రీసిటీ(Sri City) పారిశ్రామిక ప్రాంతంలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో(Til Healthcare Industry) శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో బాయిలర్ (Boiler) ఒక్కసారిగా పేలడంతో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో నైట్ షిఫ్ట్‌లో దాదాపు 30 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు సమాచారం.

పేలుడు ధాటికి పరిశ్రమలో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి (Rescue Personnel) చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిథిలాల్లో మరెవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment