మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) తొలిసారి జంటగా నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘శ్రీ శ్రీ’పై (Sri Sri) రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు రవి నెలకుదిటి (Ravi Nelakuditi) తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌కు ఇది 10వ చిత్రం కాగా, ఇషాన్ సక్సేనా (Ishan Saxena) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, వర్కింగ్ స్టిల్స్ మంచి హైప్ తీసుకురాగా.. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ‘బొమ్మ బొమ్మ’తో (Bomma Bomma) మేకర్స్ మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
‘బొమ్మ బొమ్మ’ (Bomma Bomma) పాటలో ప్రేమలో పడిన తొలి క్షణాలను ఎంతో అందంగా చూపించారు. రైల్వే స్టేషన్‌లో బెంచ్‌పై కూర్చున్న దుల్కర్ సల్మాన్.. ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన పూజా హెగ్డేను చూసిన క్షణంలోనే ప్రేమలో పడే సన్నివేశాలు పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) మరోసారి తన మ్యాజిక్ చూపించారు. సింపుల్ మెలోడీకి క్లాసీ ఆర్కెస్ట్రేషన్ జోడించి పాటను హార్ట్ టచ్చింగ్‌గా తీర్చిదిద్దారు. అనంత (Anantha) రాసిన సాహిత్యం, కపిల్ కపిలన్ (Kapil Kapilan) మధురమైన గాత్రం పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. రామ్ మాస్టర్ (Ram Master) అందించిన కొరియోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను విజువల్‌గా మరింత అందంగా మార్చింది.
మొత్తానికి ‘బొమ్మ బొమ్మ’ పాటతో ‘శ్రీ శ్రీ’ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీకి ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుండగా.. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






