తమిళ్ స్టార్ హీరో సూర్య(Suriya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సినిమాతో కొత్తదనం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే సూర్యకు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన దాదాపు ప్రతి సినిమా తెలుగులో డబ్ అయి మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఇప్పుడు మరోసారి పవర్‌ఫుల్ కథతో ‘వీరభద్రుడు’(Veerabhadrudu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ చిత్రంలో సూర్య సరసన త్రిష కృష్ణన్(Trisha Krishnan) హీరోయిన్‌గా నటిస్తుండగా, దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ హిట్ జోడి మళ్లీ కలిసి కనిపించనుండటం అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. దర్శకుడు ఆర్జే బాలాజీ(RJ Balaji) తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 14న థియేటర్లలో విడుదల కానుంది.
తమిళంలో ‘కరుప్పు’(Karuppu) పేరుతో విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ (Trailer) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసి కట్ చేసిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా రెండు విభిన్న కోణాల్లో కనిపిస్తున్న సూర్య పాత్ర సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ట్రైలర్‌ను బట్టి చూస్తే లాయర్ ముసుగులో నేరాలు చేసే విలన్ (Villain) బేబీ కృష్ణను (Baby Krishna) సూర్య ఎలా ఎదుర్కొంటాడు? సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడు? అన్నదే కథలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది. యాక్షన్ సీన్స్‌తో పాటు సూర్య డైలాగ్స్ కూడా అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుండగా, మే 14న ‘వీరభద్రుడు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.






