---Advertisement---

OTT Release: ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

September 7, 2026

Summarize with AI

---Advertisement---

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath & Sons). ఈ సినిమాలో మమిత బైజు (Mamitha Baiju) హీరోయిన్‌గా నటించగా.. సంగీత సంచలనం జి.వి. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) స్వరాలు సమకూర్చారు. అద్భుతమైన పాటలతో పాటు ఆకట్టుకునే నేపథ్య సంగీతంతో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ 11 (September 11) నుంచి ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment