---Advertisement---

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం..

May 9, 2026

---Advertisement---

పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో (Politics) భారీ మార్పు చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వం (BJP Government) ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి (Suvendu Adhikari) రాష్ట్ర ముఖ్యమంత్రిగా (Chief Minister) ప్రమాణ స్వీకారం చేశారు.

గవర్నర్ (Governor) బీఎన్ రవి (BN Ravi) సువేందు అధికారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సీఎం సువేందు అధికారి అధికారిక ఫైలుపై సంతకం చేశారు. కార్యక్రమంలో ప్రధాని మోడీ(Narendra Modi), అమిత్ షా(Amit Shah), జేపీ నడ్డా(JP Nadda), రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh), సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో (Yogi Adityanath) పాటు పలువురు కీలక నేతలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

బీజేపీకి బెంగాల్‌లో ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా మారింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకుంది. దీంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు వెల్లివిరిశాయి.

ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడా ఇదే వేదికపై ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలోనే పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం.

బెంగాల్ రాజకీయాల్లో ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీకి (Mamata Banerjee) ఇది పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment