---Advertisement---

ప్రారంభం రోజునే తాండవా అక్విడక్ట్‌కు లీకులు.. నాటి పాలన డొల్లతనం మళ్లీ బయటపడిందా?

September 3, 2026

Summarize with AI

---Advertisement---

పోలవరం ఎడమ కాలువ(Polavaram Left Canal) ద్వారా గోదావరి జలాలను(Godavari Waters) విడుదల చేసిన తొలిరోజే తాండవా అక్విడక్ట్‌లో(Tandava Aqueduct) లీకేజీలు కలకలం రేపాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం కేఎల్‌ పురం వద్ద నీటిని విడుదల చేయగా.. తుని–పాయకరావుపేట(Tuni–Payakaraopeta) మధ్య తాండవ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని (Tandava Sugar Factory) అక్విడక్ట్ పగుళ్ల నుంచి నీరు జలపాతంలా కిందకు కారినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో వంతెన కింద రాకపోకలు సాగించే ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

ఈ అక్విడక్ట్ నిర్మాణం వెనుక ఉన్న కాంట్రాక్ట్ వ్యవహారంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2005లో వైఎస్సార్ (YSR) పాలనలో ప్యాకేజీ-5 కింద పోలవరం ఎడమ కాలువ పనులకు సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్‌కు (Sabir Dam Water Works) కాంట్రాక్ట్ ఇవ్వగా.. 2016లో చంద్రబాబు(Chandrababu) పాలనలో ఆ పనులను 5(ఏ)గా విభజించి, టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో టీడీపీకి(TDP) చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ (Putta Sudhakar Yadav) సంస్థకు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి. 2019 నాటికి ఆ సంస్థ చేపట్టిన పనుల్లో భాగంగానే తాండవా అక్విడక్ట్ నిర్మాణం జరిగిందని పలువురు పేర్కొంటున్నారు.

2014–19 మధ్య నిర్మించిన తాత్కాలిక సెక్రటేరియట్, హైకోర్టు, పోలవరం కుడి కాలువ రామిలేరు వాగు అక్విడక్ట్, మాల్యాల తాత్కాలిక రెగ్యులేటర్, పురుషోత్తపట్నం పైపులు, తమ్మిలేరు వాగుపై నిర్మించిన తాత్కాలిక అక్విడక్ట్ కొట్టుకుపోయాయని, నిర్మాణ నాణ్యతపై గతంలోనూ విమర్శలు వచ్చాయని ప్రస్తావిస్తూ.. తాండవా అక్విడక్ట్ ఘటన కూడా అదే తరహా నిర్మాణ లోపాలకు నిదర్శనమా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ప్రారంభం రోజునే అక్విడక్ట్‌లో లీకేజీలు (Aqueduct Leakages) బయటపడటంతో.. నిర్మాణ నాణ్యతపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో నాటి పాలనలో చేపట్టిన మరిన్ని నిర్మాణాల్లో ఏవైనా లోపాలు వెలుగులోకి వస్తాయా అన్న చర్చ కూడా జరుగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment