---Advertisement---

TFPC: ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ఉత్కంఠ.. అధ్యక్షుడిగా ఎవరు గెలిచారంటే?

September 6, 2026

Summarize with AI

---Advertisement---

టాలీవుడ్‌లో ఉత్కంఠ రేపిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (Telugu Film Producers Council) ఎన్నికల ఫలితాలు (Elections Results) తాజాగా వెలువడ్డాయి. ఓట్ల లెక్కింపు పూర్తవడంతో ఎన్నికల అధికారులు విజేతలను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సీ. కళ్యాణ్ (C. Kalyan) నేతృత్వంలోని ప్యానెల్ ఘన విజయం సాధించి కీలక పదవులతో పాటు కార్యనిర్వాహక కమిటీలోనూ ఆధిపత్యం చాటుకుంది.

అధ్యక్షుడిగా సీ. కళ్యాణ్ (C. Kalyan) ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మోహన్ వడ్లపట్ల (Mohan Vadlapatla) 338 ఓట్లు, కేఎల్ దామోదర్ ప్రసాద్ (K. L. Damodar Prasad) 274 ఓట్లు సాధించి విజయం సాధించారు. కోశాధికారిగా చదలవాడ శ్రీనివాసరావు (Chadalavada Srinivasa Rao) 383 ఓట్లతో గెలుపొందారు.

సంయుక్త కార్యదర్శులుగా అమ్మిరాజు కానుమిల్లి (Ammiraju Kanumilli) 416 ఓట్లు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ (Thummalapalli Ramasatyanarayana) 398 ఓట్లు సాధించి ఎన్నికయ్యారు.

మొత్తం 15 కార్యనిర్వాహక కమిటీ సభ్యుల స్థానాల్లో పద్మిని నాగులపల్లి 426 ఓట్లతో అత్యధిక మెజారిటీ సాధించారు. రవిశంకర్ యలమంచిలి 412, సునీల్ నారంగ్ 411, జేవీ మోహన్ గౌడ్ 404, శివలెంక కృష్ణప్రసాద్ 397, డీవీవీ దానయ్య 360 ఓట్లతో విజయం సాధించారు. అలాగే వంశీ నందిపాటి 355, పల్లి కేశవరావు 345, డీఎస్ రావు 337, వజ్జ శ్రీనివాసరావు 329, జే. పుల్లారావు 325, బాపిరాజు బల్లిపాడు 324, పి. రామకృష్ణాగౌడ్ 304, ఎస్కే నయీమ్ అహ్మద్ 285, కే. నిరంజన్ రెడ్డి 281 ఓట్లతో కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.

ఈ ఫలితాలతో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో సీ. కళ్యాణ్ ప్యానెల్ స్పష్టమైన ఆధిపత్యాన్ని సాధించింది. దీంతో త్వరలో కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టనుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment