నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్'(The Paradise) నుంచి మరో అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న వేళ.. మ్యూజికల్ ప్రమోషన్స్‌తో చిత్ర బృందం హైప్‌ను మరింత పెంచుతోంది.
ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ (Aaya Share) ప్రేక్షకులను ఊపేసింది. సోషల్ మీడియాలో ఈ పాట భారీ వ్యూస్ సాధించి ట్రెండింగ్ నం.1 స్థానంలో నిలిచింది. ఈ సాంగ్‌తో సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. నాని స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఎనర్జీ, మ్యూజిక్‌కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు అదే జోష్‌లో సెకండ్ సింగిల్‌పై (Second Single) మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చినట్లు సమాచారం. ఫిల్మ్ నగర్ వర్గాల ప్రకారం ది ప్యారడైజ్ రెండో పాటను (Second Song) మే 10న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ సాంగ్‌లో హీరోయిజం చూపించిన మేకర్స్.. ఇప్పుడు వచ్చే పాటలో లవ్ యాంగిల్‌ను ప్రెజెంట్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, నాని డిఫరెంట్ లుక్‌కు మంచి స్పందన రావడంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మొత్తంగా చూస్తే.. ది ప్యారడైజ్ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సినిమాపై హైప్‌ను మరింత పెంచేస్తోంది. ఇప్పుడు అందరి చూపు మే 10న విడుదల కానున్న రెండో పాటపైనే ఉంది.






